కలిసి ఉండండి (బాల గేయం);-ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
కలతలు ఎరగని పిల్లల్లారా
కుల మత బేధం వదలండి
కలిసి మెలిసి ఉండండి
కులాల కుంపటి వద్దండి

అందరిలోన ఉండేది
ఓకే రక్తమని చెప్పండి
మనుషులంత ఒకటేనని
లోకమంతా చాటండి

చేతికి ఐదు వ్రేళ్ళుంటేనే
పిడికిలి గట్టిగా ఉంటుంది
చిన్నగా పెద్దగా ఉన్నా గాని
కలిసికట్టుగ ఉంటాయి

బరువెంతైనా లేపుతాయి
ఐక్యతగా  మీరుంటే
దేన్నైనా సాధించే దీరులు
మీరే మీరే పిల్లల్లా రా