తాతయ్య కథలు-29. :ఎన్నవెళ్లి రాజమౌళి

 ఎన్ని మెట్లు ఎక్కామని లెక్కించవద్దు. మెట్లు ఎక్కుతూనే వెళ్లాలి, అన్న తండ్రీతో-
ఇది ఎందుకు చెబుతున్నావు నాన్న అన్నాడు కొడుకు.
సంపాదనలో తనకంటే తక్కువ వారిని చూసి తృప్తి పడాలి. జ్ఞానం లో కానీ, సాహితీ-కళలలోకాని తనకంటే గొప్ప స్థాయిలో ఉన్న వారితో పోటీ పడాలి.
విజ్ఞాన ఆర్జనలో ఎంత చదివినా తక్కువే... అలాగే సాహితీ కృషి లోనైనా, కళా కృషి లోనైనా ఇంత సాధించానని గర్వ పడకూడదు. తృప్తి పడకూడదు. చివరి వరకు పోరాటం చేస్తూనే ఉండాలి అన్న నాన్నతో-
నాన్న నేను పాటలు బాగా పాడుతాను కదా అనగానే..
పాడుతా వు. అందులో సందేహం లేదు. సంగీతం నేర్చుకోవాలి. పాటలు పాడడానికి కృషి చేయాలి. అలాగే చదువు కూడా అశ్రద్ధ చేయకూడదు. అన్న నాన్నతో సరే నాన్న అన్నాడు కొడుకు.
కామెంట్‌లు