తాతయ్య కథలు-35. :- ఎన్నవెళ్లి రాజమౌళి

 ఎల్లయ్య కు ఎద్దులు లేవు. బాలయ్యకు బండీ లేదు. రాత్రులందు బాడుగ కొట్టారు. అంటే ఏమిటి తాతయ్య అని సురేష్ అడగగానే-
ఎల్లయ్య, బాలయ్య లు కూలి చేసుకుంటూ-రాత్రి అయ్యాక ఇద్దరూ అరుగుమీద కూర్చునే వాళ్ళు.
కూర్చుండి ఏమి చేసేవారు తాతయ్య. ముందుగా చెప్పినట్టు కోతలు కోసే వారు. ఎల్లయ్య ఎద్దులతో... బాలయ్య బండితో బాడుగలు చేసి డబ్బు సంపాదించాలని అనుకునేవారు.
అలా అనుకుంటే ఎద్దులు, బండి వస్తుందా తాతయ్య అని సురేష్ అడగడంతో-
బాగా అన్నావ్ రా. గాలిలో మేడలు కడితే నిలువవు. దానికి దగ్గటుల శ్రమ చేయాలి. డబ్బును ప్రోగు చేయాలి.
ఇంకా ఏమి అనుకునే వాళ్లు తాతయ్య. బాడుగ  వలన వచ్చిన డబ్బుతో ఇద్దరూ బిల్డింగ్ కట్టుకోవాలని అనుకునేవారు. ఇలా అనుకుంటుండగానే రాత్రి బాగా అయ్యేది. ఎవరి ఇంటికి వాళ్లు వెళ్లేవాళ్లు. పొద్దున లేచి యధావిధిగా కూలికి వెళ్లేవారు.
అని తాతయ్య అనగానే-మాటలు కాదు కృషి ఉండాలి తాతయ్య అని సురేష్ అనగానే... బాగా చెప్పావు రా అన్నాడు తాతయ్య.