తాతయ్య కథలు-40. ఎన్నవెళ్లి రాజమౌళి

 100 అయ్యేవరకు నన్ను సాదు. 100 అయినాక, నిన్ను సాదుత అన్నదట రూపాయి. అని తాతయ్య అనగానే-
వంద పెద్ద డబ్బులా! అన్నాడు మనవడు. ఇప్పటి మాట కాదు రా...  ఇది వందల సంవత్సరాల కిందట వచ్చిన సామెత.
ఇప్పుడు లక్ష అయ్యేవరకు నన్ను సాదు. లక్ష అయినాక నిన్ను సాదుతా అంటే సరిపోతుందా తాతయ్య.
బాగా చెప్పావు. నీవు అన్నట్లే డబ్బు కొంత జమ అయ్యేవరకు ఖర్చులు తగ్గించుకోవాలి. పూర్వం అలా డబ్బు జమ చేసేవారా తాతయ్య!
అవును. ఇంటిలో కొయ్య కుండల డబ్బులు దాచుకునే వాళ్లు. ఆ డబ్బు ఆపదల వాడుకునేవారు.
అయితే నేను గల్లా పెట్టె లో ఇప్పటినుండి జమ చేసి, నీకు మంచి చేతి కట్టె తెస్తా అని మనవడు అనేసరికి-తాతయ్య పకపక నవ్వాడు.
కామెంట్‌లు