బంతి నేలకు గట్టిగా కొట్టి న మనవడు-ఆ బంతి పైకి ఎగిరి కింద పడగానే... తాతయ్య అన్నింటికీ ఏదో... ఏదో... చెబుతుంటావు. దీని గురించి ఏమైనా చెబుతావా అనగానే-
బంతి ని నేలకు ఎంత గట్టిగా కొడితే అంతే పైకి పోతుందా! లేదా! పోతుంది అని మనవడు అనగానే-
ఆ... అదే మనకు చెప్పే నీతి. అందులో నీతి ఏమి ఉంది తాతయ్య. బంతి పైకి వెళ్లినట్టు... సమస్యలు ఎన్ని వచ్చినా...తొణకకుండా గట్టి పడాలి. అదిరి పోవద్దు.
బంతి నేలకు ఎంత గట్టిగా కొడితే అంత పైకి వెళ్లినట్టు... మనం అం తే... ఎంత ఎక్కువ బాధ అయినా... అంతే ఎక్కువ గట్టి పడాలి.
సమస్యలు మనుషులకు కాక, మానులకు వస్తాయా! ఈ సంగతి జీవితంలో మరువ రాదు.
ఎవరో ఏదో అన్నారని మన మార్గాన్ని విడువద్దు. తప్పుడు పని చేయకుంటే చాలు అని తాతయ్య అనగానే.... ఇందులో ఇంత భావ ముందా తాతయ్య అన్నాడు మనవడు. అవును అన్నాడు తాతయ్య.
తాతయ్య కథలు-53..:- ఎన్నవెళ్లి రాజమౌళి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి