. * శ్రీ మున్షి ప్రేమ్ చంద్ *
సీస పద్యం
ఉర్దు, హిందీ భాష ల్లో రచయిత -- మున్షి
ప్రేమ్ చందు , కథలను యెన్నొ వ్రాసె ;
విద్య శాఖలొ పరీక్షించేటి అధికారి ;
పెట్టె సొంతముగాను ప్రెస్సు నొకటి ;
విధవగా యుండెడి శివరాణి దేవిని ,
భార్యగా స్వీకరిం చారు నితను ;
బాజాద్ ఎ హుస్న్ ,గబన్,కర్మభూమి,ప్రతిజ్ఞ,
గోదాన్ , మనోరమ -- గొప్ప వైన
తేటగీతి
వివిధ నవలలు , సంపాదకీయ రచన ;
కథలులో మేటి 'ఈద్ పండుగ'తొలి నిలిచె ;
గాంధి జీ బోధనలు స్ఫూర్తి యాయె మదిని ;
ప్రేమ తత్త్వము పొందియు పంచి నట్టి ;
సుచరి తుండేను, ప్రేమచం దురుడె,ఇలను !!
~~~~~~~~@~~~~~~~~
జననం:31-07-1880#08-10-1936:మరణం
శ్రీ మున్షి ప్రేమ్ చంద్ # వార్కి స్మృత్యంజలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి