* నికొలస్ కోపర్నికస్ *
సీస పద్యం
ఎవరిచుట్టు యెవరు తిరిగేది?సంశయం !
భూమియా?సూర్యుడా?సూత్ర మేమి ?
శోధించె , నికొలసు కోపర్నికస్ వేత్త ,
నిర్ధారణను చేసి , నిజము చెప్పె ,
భూమి తనలొతాను , సూర్యుని చుట్టునూ,
పరిభ్రమిస్తుందని ; పగలు , రేయి,
యేర్పడు తున్నాయని; యెవరూ నమ్మలే !
తదనంతరము,సమ్మ తమనె భువిలొ ;
తేటగీతి
వైద్యు నిగ : చర్చి మతపెద్ద యై శ్రమించె ;
రూపు దిద్దె , కాలప్రమాణ సూత్రములను ;
ఠంక శాలలో ధనరూప టార్గె టిచ్చె ;
జీవి తాన , ప్రతిఘటన లే యెదురయె !!
~~~~~~~~@~~~~~~~~
జననం:19-02-1473#24-05_1543:మరణం
నికొలస్ కోపర్నికస్ # వార్కి స్మృత్యంజలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి