నువ్వు గానే వుండాలి:-మచ్చరాజమౌళిదుబ్బాక.9059637442

 నీ నవ్వులు నీవిగానే వుండనీ
వాటికి లేనిపోని రంగులద్దకు
నీ మాటలు నీవిగానే రానీ
వాటికి రాని హంగులు చేర్చకు
నీ నడకలు నీవిగానే నడువు
వాటికి కొత్త పొంగులు జమచేయకు
మార్పుల చేర్పుల ఈ మాయలో
మనిషన్నవాడు
మాయమవునేమో…
అందుకే..
నువ్వు నువ్వుగానే వుండు..

కామెంట్‌లు