హాయిగా మట్టిలో ఆడుకో!--(సైన్స్ వ్యాసం)-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

  ఒకానొక పరిశోధన ప్రకారం డెబ్భైఏళ్ళ క్రితం ఎలర్జీలు,కొన్ని రకాల ఆరోగ్య రుగ్మతలు ఇప్పుడున్నంత తీవ్రంగా ఉండేవికావు.ఎలర్జీలు,అనేక రోగాలకి కారణం అతి శుభ్రత!
        నిజానికి మనదేశంలో ఇటువంటి ఎలర్జీలు,మరికొన్ని రకాల జబ్బులు కొన్ని విదేశాలతో పోలిస్తే చాలా తక్కువ.అదే అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఎలర్జీ సమస్యలు ఇంకా అనేక రోగాల సమస్యలు, రోగ నిరోధక శక్తి లేక పోవడం చాలా సాధారణం!
ఎందుకంటే వాళ్ళు అతి శుభ్రత పాటిస్తున్నారు కాబట్టి!
       వేల సంవత్సరాలనుండి  మనకు మేలు చేసే,రోగం కలుగ చేసే సూక్ష్మజీవులతో నివశిస్తున్నాం.ఆ సూక్ష్మ జీవులు మనుషులు లేక వృక్షాలతో జీవక్రియలు సలుపుతూ కొన్ని రకాల సూక్ష్మజీవులు హానికారకాలుగా,మరికొన్ని మేలు చేసేవిగా ఉన్నాయి!
      మరీ శుభ్రతను పాటిస్తే జీవిమధ్య సూక్ష్మజీవి మధ్య సమతుల్యం దెబ్బతిని రోగనిరోధక శక్తి నశించవచ్చు.దాని వలన మనం రోగాల బారీన పడవచ్చునని అమెరికాకు చెందిన డా॥బిల్ మిల్లర్ చెబుతున్నారు.
       సూక్ష్మజీవులకు మనకు గల సంబంధాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'హాలో జినోమ్'(hologenome)అంటారు.
      అందుకే డా॥బిల్ మిల్లర్ పిల్లల్ని స్వేచ్ఛగా ఆడుకోనివ్వాలని,కుక్క మొదలైన పెంపుడు జంతువులతో ఆడుకోనివ్వాలని,తోటి స్నేహితులతో
ఆరోగ్యవంతమైన అల్లరి  చేయమని,హాయిగా మట్టిలో ఆడుకోమని చెబుతున్నారు.అలా ఆడిన తరువాత  శుభ్రత పాటించవచ్చునని ఆయన
 'Microcosm Within' అనే పుస్తకంలో వ్రాశారు.
        జోషువా లెడర్ బర్గ్(Joshua Lederberg) అనే శాస్త్రవేత్త మనతో నివసించే లేక మనలో నివసించే సూక్ష్మజీవులకు మైక్రో బయోటా(micro biota)అని నామకరణం చేశాడు.అవి మనకు మేలు చెయ్యవచ్చు లేక హాని చెయ్యవచ్చు.
       మనం ఎక్కువ కాలం బతకాలన్నా,మనలో సక్రమంగా జీవ రసాయన చర్యలు జరగాలన్నా,రోగ నిరోధక శక్తి పెరగాలన్నా సూక్ష్మజీవులు మనకు ఎంతో అవసరం.
            *************
ఆధారం:living well(USA magazine)
             'The dirty secrets about allergies'

కామెంట్‌లు