*ఆటవెలదులు*
యోగ సాధనెపుడు యోగ్యత పెంచును
తనువు మనసు శ్వాస తావు నుంచు
శక్తి యుక్తి పెంచు చైతన్య పరచును
శాంతి సహన మబ్బు చతురతుండు
వయసు మీద పడిన వార్ధక్యము కనరాదు
నిత్య సంత సమ్ము నిండు మనసు
పంతముండబోదు పట్టింపులుండవు
సర్వ జనులు తనకు స్వంత మనును
సమయపాలనుండు సాయమెపుడు చేయు
యోగ తత్వముంచు యోచనుంచు
పెద్ద మనిషి వలనె ప్రేరణ కల్పించు
సమత మమతలెపుడు సంపదను
కార్యసాధనుండు గర్వము కనరాదు
పరిహచించబోరు పరులనెపుడు
తత్వ గుణము పెంచు దాతృత్వముండును
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి