రెక్కలొచ్చిన కవిత:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.-సెల్ నెంబర్, 9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
బువ్వ తినిపించెను మా అమ్మ
బుజ్జమ్మ గీసెనులే మంచి బొమ్మ
పత్రం రాసింది మా చిన్న చిన్నమ్మ
ఆత్రంగావిప్పి ఇక నేచదివేశానమ్మ !

పసి(డి)హృదయాల గౄపులోఉన్న
నేపాలు పంచుకోవాలని కోరుకున్న
అడ్మిన్ ఆహ్వానిస్తాడని అనుకున్న
ఆహ్వానం అందక నే బాధతో ఉన్న!

రేపు మాపో ఆహ్వానం వస్తుందని
చకోర పక్షిలా నే ఎదురు చూస్తూన్న
ఆహ్వానం వచ్చి నాఆనందం హెచ్చి
పంపిన కవిత అందు అచ్చయ్యింది

అచ్చయిన కవితను వెంటనే చూశ
మచ్చికైన నానేస్తాలకు కబురు చేశ
వారొచ్చారుచూశారు తగమెచ్చారు
పుష్పగుఛ్ఛంతో కానుకనూఇచ్చారు

నీకు రెక్కలొచ్చాయని చెప్పాడో కవి
ఇంకెందుకుఆలస్యం విని ఇక నీకని
నీ ఇష్టం ఉన్న చోటికి నీ వెళ్ళొచ్చు
నీకు కష్టం అయితే తిరిగి రావచ్చు!

నీకోసం నేను కట్టిన గూడు ఉంది
నీ నివాసంకై అది మేడ అవుతుంది
నీకు ఇష్టమైనప్పడు నీవిక రావచ్చు
నీకుకష్టంఐతే నాకోలేఖ రాయొచ్చు 

నీకోసంతలుపులు తెరిచే ఉంటవి
నామమతామల్లెలుపరిచే ఉంటవి
నీదర్శనభాగ్యంకైఎదురుచూస్తుంట
నీకై నే ఓ స్వాగతగీతం వ్రాస్తుంట !