హౌజ్ హస్బెండ్ :-..గంగశ్రీ-9676305949
  తొగిట గ్రామంలో మధు అనే యువకుడు ఉండేవాడు. ప్రవర్తనలో ప్రవరాఖ్యుడు. సాయంలో సహదేవుడు. బీ.ఈడి, టెట్ లను అరటిపండులా ఒలిచేసి డీఎస్సీ కోసం మఘలో మబ్బులకై ఎదురుచూసే రైతైనాడు. చూసీ చూసీ, వేసారి, మంచి సంబంధమని మాధురిని పెళ్లి చేసుకున్నాడు.
             కొత్తజంట జంటనగరాల్లా కలిసిపోయి, హైటెక్ సిటీలా ఆనందంగా గడపసాగింది. ఉపాధి లేక, ఊర్లో పనిలేక పోవడంతో పట్నం పోయి ప్రైవేట్ స్కూల్లో పని చేయాలని నిశ్చయించుకున్నాడు మధు.
             ఈ సారి జూన్ లోనే విద్యా వాలంటీర్లను తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో "పట్నంలో పైసలు పుట్నాలే"నంటూ ఇక్కడే వాలంటీర్ గా అప్లై చేసుకోమని సలహానిచ్చింది మాధురి. ఎక్కడికో వెళ్లి "చిక్కుడు పాదులో చిక్కుకోవడం" కంటే, ఇంటి పట్టునే ఉండి తల్లిని, తల్లిలాంటి చెలకని, చిలక లాంటి మాధురిని చూసుకోవచ్చని సరేనన్నాడు మధు.
              అన్నింట్లో డిస్టింక్షన్ మార్కులు ఉండడంతో, వెంకట్రావు పేట ప్రాథమిక పాఠశాలలో వాలంటీర్ గా నియామకం అయ్యాడు. రోజు సైకిల్ పై వెళ్లి వస్తూ, డీయస్సీ కొరకు నిద్ర లేని సైనికుడిలా సిద్ధమవుతున్నాడు. మాధురి కూడా భర్తతో పోటీపడి చదివేస్తుంది. చదువులో ఒకరికొకరు సహకరించుకుంటూ, సందేహ దాహం తీర్చుకుంటూ ఉన్నారు. నియామకమై నాలుగు నెలలైనా, జీతాలు రాక, చేతిలో చిల్లి గవ్వ లేక గువ్వ పిట్టలా చిక్కుకుపోయాడు మధు.
            కానీ కష్టపు చుట్టాలు గడప దాటి ఇంట్లోకి రావడంతో గత్యంతరం లేక కూలి పనికి వెళ్తూ ఇంటిని గట్టెక్కిస్తుంది మాధురి. విషయం తెలిసిన మధు ఆమెనేమనలేక సెలవుల్లో మాధవితో తనూ పనికెళ్ళేవాడు. మరో రెండు నెలలకు ఆరు నెలల డబ్బులు మొత్తం డెబ్బై రెండు వేల రూపాయలు రావడంతో దుబారా చేయకుండా ఇద్దరం డీఎస్సీ కోచింగ్ కి వెళ్దామని మాధురి అనడంతో, సరేనన్నాడు మధు.
            తదుపరి డీఎస్పీ లో మాధురి ఉమెన్స్ కోటాలో ఉద్యోగం సాధించగా, మధు తృటిలో తప్పాడు. ఐనా నిరాశ పడక "హౌజ్ హస్బెండై" తల్లిని, మాధవిని ప్రేమగా చూసుకుంటూ, పౌల్ట్రీ ఫార్మ్ పెట్టుకున్నాడు

                     .


కామెంట్‌లు