భలే బాగుందిరా!
బంగారు పూలతోట!!
రకరకాల పూలతోడ!
రమ్యమైన మాతోట!!
మల్లె మందారాలు !
విలసిల్లు మాతోట !!
గునుగు గులాబీలు!
గుభాలించు మాతోట!!
ఛామంతి పూబంతితోడ!
సొగసైన మాతోట !!
తంగెడుతామరురతోడ!
తారసిల్లుమాతోట!!
బొండుమల్లెలతోడ!
మెండైన మాతోట !!
తెల్లనైనలిల్లిపాలవెల్లిలా!
పరవశించు మాతోట !!
జాజులువిరజాజులు !
జాభిలమ్మవెలుగువోలె!!
జగతి పూలబాటలోన!
జాలువారు మాతోట !!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి