ఒక తేనెటీగా ఉండేది. అది పువ్వు పువ్వు తిరుగుతూ తీపి సేకరించి తేన తయారు చేస్తుంది. అలా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఓ పువ్వుతో స్నేహం కుదిరింది. అవి రెండూ మంచి మంచి ముచ్చట్లు చెప్పుకుంటూ ఎప్పుడు సంతోషంగా ఉండేవి. ఒక రోజు పువ్వు, తేనెటీగను ఇలా అడిగింది. "మిత్రమా! నీవు శ్రమించి దాచుకుంటున్న తేనెను మానవులు దోచుకెళుతున్నారు కదా? నీకు బాధ అనిపించదా?" అని
తేనెటీగ చిన్నగా నవ్వి. "ఎందుకు బాధ. వారు తీసుకు వెళుతుంది నేను తయారు చేసే తేనెనేగా?, నాలో ఉన్న తేనె తయారు చేసే నైపుణ్యాన్ని కాదుగా? నేను మళ్ళీ తయారు చేసుకుంటాను. మానవులు, జంతువులు నేను దాచుకున్న తేనెను దోచుకుంటున్నారని నాకు ఎప్పుడు అనిపించలేదు. పైగా పరులకు ఉపయోగపడుతున్నందుకు చాలా తృప్తిగా కూడా ఉంటుంది. నేను ఏ విధంగానూ ఎవరికి సాయపడలేను. నాకు తెలిసిన విద్య ఇదొక్కటే. ఇందుకు అయ్యే ఖర్చు కుడాలేదు. మీ నుండి ముడిసరుకు ఉచితంగా దొరుకుతుంది. నాకు తెలిసిన విద్యతో తయారు చేస్తున్నాను. ఉచితంగా వచ్చేది ఉచితంగానే ఇవ్వాలి కదా" అన్నది. తేనెటీగా ఔదార్యానికి పువ్వు ఆశ్చర్య పోయింది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి