చిత్రానికి పద్యాలు:-మమత ఐల-హైదరాబాద్

 కం
అందములలరారే కను
విందగు పుష్పమ్ములిచట విరబూయుటలో
బృందావన శోభగొలిపి
సుందరమగువనముకూర్చెచూడముకృష్ణా!
ఆ.వె
పసుపుముద్దలవలె పచ్చనైనదితోట
ముద్దబంతులిచట మోదమలరె
శ్రద్ధ బెట్టిచూడ స్వర్గదామమెభువి
మనసుపెట్టి వినుము మమతమాట