త్రిపదలు :-ఎం. వి. ఉమాదేవి
చేతగాని తనమేదో 
కప్పిపుచ్చుకునేందుకే నేమో 
కొందరెపుడూ కోపంగానే.. 

లోపల భావనలు ఎప్పుడూ 
దాచుకోరాదని 
సముద్రం అలల ఘోష !

వలపులొలికే చెలియతో 
ఎడారి పయనమైనా 
ఆత్మవిశ్వాసపు ఒయాసిస్సు !

కన్నీళ్ల కోనేరు లోనే 
హఠాత్తుగా వికసించిన కలువ 
జీవిత అదృష్ట చంద్రోదయం !

సన్మానం అవసరంలేని 
నిత్యావధాని ఇల్లాలైనా
తృప్తిలేని పృచ్ఛకుడు పతి !

కామెంట్‌లు