ఏదో మాయ!:-యలమర్తి మానసహైద్రాబాద్

 అదేప్రదేశం ...
రోజూ చూసేదే ...
ఐనా కొత్తగా..
అందంగా.. ఆహ్లాదంగా కనిపిస్తుంది
అదే పాట... 
ఎప్పుడూ వినేదే... 
కానీ సంగీతం బదులు 
మనసు భావాన్ని వింటోంది
గొప్పతనం 
ఆ క్షణానిదే!