బడి (బాలగేయం)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
అక్షరాలు నేర్వాలి 
పుస్తకాలు చదవాలి
చక్కగా మాట్లాడాలి 
ఎన్నెన్నో చెప్పాలి 

బొమ్మలలో కొంతైనా 
అక్షరాలలో ఎంతైనా 
విజ్ఞానం  పర్వతమైనా
చదివే తరగతి మెట్లైనా

అందరు బడికి పోవాలి
గురువుల బోధలు వినాలి
నిత్య సాధనలు చేయాలి
విజేతలగా ఎదగాలి.