జీవన సారము:- అనురాధ మచ్చ

 ఉత్పలమాల పద్యాలు

సంచిత పాప కర్మలిల సాగును జీవిత మందునన్ గనన్,
కొంచెము బాధ గల్గినను కూర్చు దురందరు వింత చింతలన్,
యంచనవేయలేమునిల హాయిగ సాగదు సృష్టియందునన్,
పంచిన పోవు కష్టములు బంధు జనావళికిన్ సుమా!,నిలన్,
పంచగ వృద్ధి నొందుకడుపావన మౌనిల ప్రేమలన్గ నన్.
ఉ.
కర్మము తీరు నెంచగను కాలము తీర్పును నొప్పుకొన్న నా,
మర్మము లెన్నియో జరుగు మాయల లోకములోన జూడగన్,
కూర్మిగ యెంచి జూడ గోచర మాయను  స్వీయకృత్యముల్,
ధర్మము దప్పకుండగను దక్కును బెక్కుగ సౌఖ్యముల్ నిలన్.
ఉ.
పుట్టిన జన్మ గొప్పదిల బుద్ధిగ కష్టములెన్ని వచ్చినన్,
పట్టుగ సంతసంబుగను పావన మొందుట లక్ష్యమే యనిన్,
పట్టపు రాజు గా బ్రతుక, పారునిడుమ్ములు లెక్కజేయకన్,
చెట్టుగ నీడనిచ్చినను చేరును నీ దరి మేలుగోరియున్,   
కష్టము వచ్చి యేడ్వగను కాగల కార్యము లెల్ల మానునే!.
శార్దూలము
అంతా నా తలరాత యన్న మనసా !యాటంకమౌ జీవనం,
వంతున్నాదని యెంచుమోయి కడకున్ ప్రాప్తంబు లేవైన తా
చింతాకంతయు చింత లేకయుమదిన్  క్షేమంగ సాగున్కదా!
పంతం బూనియు జేయుమన్న వినుమా  పాపాలు నావేననీ!.
కామెంట్‌లు