చెట్లు బాలగేయం:-మిట్టపల్లి పరశురాములు
*చేయిచేయి కలుపుమురా! మొక్కలునాటగకదులుమురా!!*

*ఊరికి చెట్లె సోదరా !*
*ఊతమునిచ్చునుచూడరా!!*

*కంచెనునాటికాయుమురా!*

*నిత్యమునీళ్ళుపోయుమురా!!*

*చెట్లెప్రగతికిమెట్లురా !*
*తొలగించునుమనపాట్లురా!!*

*పల్లెకు అందము పచ్చదనము!*
*బతుకునచేయునువెచ్చదనము!!*

*తరువులుఉన్ననుసోదరా!*
*వానలుబాగాకురియునురా!!*
*కరువురాకుండచేయునురా!!!*