అమ్మ (బాలగేయం)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
ఎలా ఉన్నా చందమామే
ఎంత తిన్న కొంచమే
అల్లరి చేస్తే ఇష్టమే
ఏడిస్తేనే కష్టమే

తప్పులన్నీ ఒప్పులే
అలకలైనా ముద్దులే
చేష్టలన్నీ నవ్వులే
పసివాడే అమ్మకు

అమ్మ మనసు ఆకాశం 
తనయే తన సర్వస్వం 
మాటలలో వాత్సల్యం
ప్రోత్సాహమే నిరంతరం