వరద గూడు(బాల గేయం):-ఎడ్ల లక్ష్మిసిద్దిపేట
పొద్దటి సూర్యుడు వచ్చాడు
ముద్దుముద్దుగా మెరిశాడు
చుట్టూ వలయం వచ్చింది
సూర్యుడు మధ్యల నిలిచాడు

కిరణ కాంతి వెలుగుల్లో
రంగురంగుల గుండంలో
పక్కన చుక్క మెరవంగా
తెల్లని భానుడు నవ్వాడు

భూమికి అందం

పంచాడు
మూడు రంగుల వలయం తో
అందరిని ఆశ్చర్య పరిచాడు
జనాల మనసులో నిలిచాడు

సూర్యుని చుట్టునున్న గూడు
వరద గూడు అంటారు పెద్దలు
వానచినుకుల బిందువు అది
వర్షాల రాకకు సూచన అంటారు