*జీవనమార్గము* *(సూక్తిసుధ)*:-*మిట్టపల్లి పరశురాములు

 *ఆ.వె*
*మంచి పథము నెంచి-మనుజుండునడిచిన*
*స్వర్గ ధామ  మగును-సకలమందు*
*దానధర్మములను-దయతోడజేయగ*
*జన్మధన్యమౌను-జగతియందు*
 *కం*
*చక్కని కుటుంభమందున*
*మక్కువచేతను గలిసిరి* *మనుజులునాడున్*
*మిక్కిలిసంపదగలిగియు*
*చిక్కనిసంసారమునను* *చిగురులుతొడగన్*
 *కం*
*భక్తులుగుంపుగకూడియు*
*ముక్తినిగోరుచునునెల్లముందుగహరకిన్*
*భక్తిగమాలనువేసీ*
*భక్తిచెపూజలనుజేయుభజనలచేతన్*
*తే.గీ*
*మనుజ జన్మమనునదియు-మహినియందు*
*పుణ్యఫలములచేతనే-పొందినాము*
*విర్రవీగవలదునీవు-వెర్రివాడ*
*పరులకుపకారమొనరించి-ఫలముపొంది*
*మనగ వలెనోయి బ్రతుకున-ఘనముగాను*

కామెంట్‌లు