పొగాకు వద్దు -మొగ్గలు :--ఎం. వి. ఉమాదేవి -నెల్లూరు.
పొగత్రాగడం నాగరికత అనుకుంటూనే 
చేజేతులా ఆరోగ్యనాశనం చేసుకోవద్దు 
పొగాకు కాదు పగాకు అది మరువకు!

వ్రేళ్ల మధ్య విలాసంగా కనిపిస్తూనే 
మనుషులమధ్య చిచ్చురేపే వగలమారి పొగాకు!
కౌమార ఆసక్తితో పొగత్రాగడం మానాలి!

రక రకాల కంపెనీల ఉత్పత్తులతోనే 
గుట్కా,ఖైనీ

వంటివి క్యాన్సర్ కారకాలు!
ఒకసారి వాడితే దీర్ఘకాల నష్టమే!

మహిళలు కూడా వీటికి అలవాటుపడుతూ 
ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు!
పొగాకు మాని పోషకాహారం తినాలి!