ధర్మము సత్యము దైవము నిత్యము
మరువక పాటించు మాన్య తగను,
చెడనిది చివరికి చెంతన యుండేది
ధర్మ మేన నెరుగు ధరణ మనకు,
శ్రీరాముని నడక శ్రేష్టమై వెలుగొందె
నాచంద్రార్కము నవనియందు,
కష్టాలు కలుగును కడవరకు బ్రతుక
ఫలితమ్ము యుండును ప్రజల నోట,
ఫలితమాశించక పనులెన్నొ జేయుము
బాధ్యత గుర్తించి బాగుగాను,
ధర్మ మార్గంబులు ధరయందు పాటించు
విత్తును బట్టియే విత్తనంబు,
ధర్మాన్ని బోధించ ధర్మము కాదుగా
ఆధ్యాత్మికమ్మునయలవడునిల
స్వార్థ బుద్ధిని వీడి సాగుచు నున్నను
చేకూరు మేలెంతొ చేవగలిగి.
తేటగీతి
చిన్ననాటి నుండియు నేర్ప జీవితాన,
మంచి మార్గంబున నడచి మాన్యులౌను,
పిల్లలద్దాలు మన యొక్క పెంపకమ్ము,
తిట్టవలదు వారిని జూసి దీవెనివ్వు .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి