*కోతి మూక - కోళ్ళ విజయం*(గేయకథ) -: ఐదవ భాగం :-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 17)
కోడి కోపమున ఎగిరెను పైకి
కోతి మోమును పొడిచెను ముక్కుతో
రక్కెను కాళ్ళతో ఆ కోడీ
కొట్టెను రెక్కతో ఆ కోడీ!
18)
బలిసినకోడీ దెబ్బలుతిన్న
కోతికి భయమూ వేసింది
పక్కన చెట్టూ ఎక్కింది
తగిలిన దెబ్బలు చూచుకొంది!
19)
అయినా వదలక ఆ కోడి
చెంగున పైకి ఎగిరింది
కోతి భుజంపై ఎక్కింది
కళ్ళను ముక్కును పొడిచింది!
20)
భయముతొ బాధతొ ఆ కోతి
ఉరుకులు పరుగులు పెట్టినది
అయినా వదలక ఆ కోడి
తన రెక్కలతో బాదింది!!
(సశేషం)
{ఫిబ్రవరి 2008 మొదటి వారంలో TVలో వచ్చిన ఒక వార్త ఆధారముగా}