పాలకడలిపై అదిశేషుని పడగనీడలో పవళించిన విష్ణుమూర్తి పాదాలను వత్తుతూ ఇలా అంది లక్ష్మిదేవి. "నాధా! నేను ఎవరివద్ద చేరినా వారు సంపన్నులు అవుతున్నారు గాని పేదవారిని అదుకోవటంలేదు. ఏవరికివారే కోట్లకు కోట్లు కూడబెడుతున్నారు తప్ప ఆకలితో అలమటించేవారిని పట్టించుకోవడంలేదు. అందుకే నేను భూలోకం వెళ్ల దలుచుకోలేదు" అంది. విష్ణుమూర్తి చిన్నగా నవ్వి "దేవి! ఇది కలి యుగం. అంతేమరి. ఎవరికివారే. అయినా నీవేమి దిగులు పడకు. నీవెంటే నలుగురిని పంపుతాను వారే నీకు తోడుగా వుంటారు" అన్నాడు.
అన్నట్టుగానే ఓ మద్యంసీసాని, ప్రమాదాన్ని, మోసగాడిని, రోగాన్ని ఆమె వెంట పంపాడు. ఎవరైనా లక్ష్మిదేవి చలువవల్ల ధనవంతుడై పేదలను పట్టించుకోకపోతే మద్యంసీసా వెళ్ళేది. వాడిని పతనం చేసి వచ్చేది. దాన్ని తప్పించుకుంటే ప్రమాదం వెళ్ళేది, ఏదోఒక రూపంలో వాడికి నష్టం చేకూర్చేది. దాన్నికూడా తప్పించుకుంటే, మోసగాడు వెళ్ళేవాడు. ఉన్నదంతా దోచుకునే వాడు. వాడినికూడా తప్పించుకుంటే చివరి ఆయుధంగా రోగం వెళ్ళేది. వైద్యుడి రూపంలో సంపాదించిందంతా హరించుకుపోయేది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి