ప్రయాణం (బాల గేయం)--పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట

రోడ్ల కూడలి వచ్చింది 
సిగ్నల్ జ్ఞానం పెంచింది
ఎర్ర లైటుకు  ప్రమాదం
తెలిసి నడిసిన సంతోషం

పచ్చ లైటుకు ప్రయాణం
గమ్యం చేర్చు క్షేమం
అజాగ్రత్త లే అపాయం 
సమయ పాలనే ఆనందం

అతి వేగమే ప్రమాదం
అతి విలువైనది ప్రాణం 
వేగం వద్దు ప్రాణం ముద్దు
దాట కూడదూ ఈ హద్దు.
కామెంట్‌లు