ఎక్కడోయ్ సమానత్వం
ఏమూలను దాగిఉంది
వివక్షతల మబ్బులోను
విచారంగ చూస్తున్నది
వారెవ్వా సమానత్వం
మాటలవరకు పరిమితం!
కులం మతం కుమ్ము లాటె
అభివృద్ధికి వెనుక బాట
బడాబాబు పెరట్లోను
బానిసలకు రాజబాట
వారెవ్వా కూలి రేటు
సగానికి సగం పోటు!
మహిళా సమానత కలే
ఏపనికి వెదికే తప్పు
ఆమె కసలు మనసుoదా?
అడిగిచూడు తనే చెప్పు
అయ్యో పురుష సమాజం
దయచేసి కాపాడండి !
తల్లి చెల్లి అక్క భార్య
కూతురు సేవ ఎంతోను
మనవరాలు తాతయ్యను
కనిపెట్టుకొనీ చూడును
వారెవ్వా వీరికి సేవలు
సహజంగా లక్షణాలు !
సాఫ్టు వేరు మహిళయినా
ఇంట్లో పనులు తప్పవు
వొత్తిడితో చేయు పనులు
అనారోగ్యముకు హేతువు
ఇంట్లో సాయం చేయండి
అది నామోషీ కాదండీ!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి