*కోతి మూక - కోళ్ళ విజయం*(గేయకథ)-: నాలుగవ భాగం :-:-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 13)
కాయలు, పళ్ళు,కూరగాయలను
కసకస నమిలీ ఊస్తాయి
చిట్టిపాపలు,కోడిపాపలను
రక్కీ,గిల్లీ చంపేస్తాయి!
ఒకనాడు..........
14)
అల్లరిమూకలొ ఒక కోతి
కోటయ్య ఇంటికి వచ్చిందీ
ముంగిటిలొ తిరుగాడుతున్న
కోడిపిల్లలను చూసిందీ!
15)
కోడిపాపలను చూసిన కోతికి
అల్లరిచేయ పుట్టెను బుద్ధి
చప్పున పిల్లను అందిపుచ్చుకొని
గిల్లీ,రక్కీ,నొక్కి చంపెనూ!
16)
చచ్చిన కోడీ పిల్లను చూసిన
కోడితల్లికీ దుఃఖము వచ్చె
పిల్లను చంపిన కోతిని చూసిన
తల్లికోడికి కోపము హెచ్చె!!
(సశేషము)
{ఫిబ్రవరి 2008 మొదటి వారంలో TVలో వచ్చిన ఒక వార్త ఆధారముగా}