అనగనగా ఒక అడవిలో ఒక చెట్టు మీద ఒక కాకి నివసించేది. అది చాలా బద్దకస్థురాలు. ఏ విషయం పట్టించుకునేది కాదు. తన గూడు కూడా విరిగిపోయి శిథిలావస్థలో ఉన్నది. కాకి తనలో తాను ఇలా అనుకుంది. ఎవడు చూస్తాడు, ఏమౌతుంది, నాకు నీడ ఉంటే చాలు అనుకునేది. ఒక రోజు రాత్రి వర్షం కురిసి, కాకి గూడు మొత్తం కిందపడి విరిగిపోయింది. కాకి కి ఏం చేయాలో అర్థం కాక, తన స్నేహితురాలైన చిలుకమ్మ దగ్గరికి వెళ్లి గట్టి, గట్టిగా పిలుస్తుంది. చిలకమ్మా చిలకమ్మా నేను వర్షంలో తడిచి పోతున్నాను. ఈ వర్షం ఆగేదాకా నీ దగ్గర అని కాస్త చోటు ఇవ్వు, అని అడుగుతుంది. చిలక తలుపు తీసి సరే సరే రా, అని లోపలికి పిలిచింది. కాసేపయ్యాక వర్షం తగ్గింది. అయినా కాకి బయటకు వెళ్ళలేదు. ఇల్లు చాలా బాగుంది నేను ఈ ఇల్లు ని ఆక్రమించు కోవాలి . అని మనసులో అనుకుంది. అప్పుడు చిలుక కాకి దగ్గరికి వచ్చి వెళ్ళు, చెట్టు దగ్గరికి వెళ్లి నీ ఇల్లు కట్టుకో అన్నది. కాకి వినలేదు. నేను వెళ్ళను, కావాలంటే నువ్వే వెళ్లి వేరే ఇల్లు కట్టుకో, నాకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. నేను ఇక్కడే ఉంటాను అన్నది కాకి. చిలుక చాలా బాధపడింది. కానీ చిలుకకు కోపం కూడా వచ్చింది. చిలక తన ముక్కుతో కాకి ని గట్టిగా గుచ్చి గుచ్చి పొడిచి పెట్టింది. దాంతో కాకి, తల్లి ఆపు ఎందుకు ఇలా చేస్తున్నావ్. నేను ఈ ఇల్లు విడిచి వెళ్లి పోతాలే అన్నది. ఇలా చిలక తన ఇంటిని కాకి బారినుండి కాపాడుతుంది.
ఒకరోజు చిలక ఆహారం వెతకడానికి అడవి కి వెళ్ళింది. అక్కడ చిలుకకు చాలా మంచి ఆహారం దొరికింది. తరువాత చిలుక కాకి దగ్గరికి వచ్చింది. కాకమ్మా కాకమ్మా..! నేను ఈరోజు చాలా మంచి ఆహారం తిన్నాను. ఇలాంటి ఆహారం నా జీవితంలో ఎప్పుడు తినలేదు అన్నది. కాకి ఆ మాట వినగానే తను కూడా వెళ్ళాలని నిర్ణయించుకుంది. కాకి చిలుక తో ఇలా అంది. చిలకమ్మా చిలకమ్మా నేను నీతో వస్తా సాయంత్రం, ఆహారం తినడానికి అన్నది. అప్పుడు చిలక, అక్కడ ఒక మనిషి పక్షులను పట్టుకుంటూ ఉన్నాడు నువ్వు వస్తే, దొరికిపోతావు. మరి చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నది. "ఏం కాదు నేను నీ కంటే తెలివైన దానినీ నన్ను ఎవరూ పట్టుకోలేరు ఉన్నది కాకి. "సరే నీ ఇష్టం ఉన్నది చిలక. ఆ రోజు సాయంత్రం కాకి చిలుక ఇద్దరు ఆహారం కోసం వెళ్లారు. అక్కడ కాకి ఒక మనిషికి దొరికిపోయింది. చిలక మనసులో ఇలా అనుకుంది, ఇంత చెప్పినా వినలేదు అని. కాకి లోపలినుంచి అరుస్తుంది. చిలకమ్మా. ! చిలకమ్మా..! దయచేసి నన్ను కాపాడు అని వేడుకుంది. చిలక తనం తెలివితేటలతో కాకమ్మను కాపాడింది. ఆ తర్వాత కాకి చిలుక ఇద్దరు చెట్టు దగ్గరికి వచ్చారు.
చిలక నీకు ఒక మాట చెప్తాను విను అన్నది. నేను నీకు వర్షంలో తడుస్తున్నవాని చోటిస్తే నువ్వు నా ఇంటిని ఆక్రమించాలని అనుకున్నావ్ కదా..! ఇపుడు కూడా కాపాడాను.చేసిన మేలు మరిచిపోయి ద్రోహం తలపెట్టకు.
నీవు చాలా బద్దకంగా ఉంటూ నీ గూడును బాగు చేసుకోవడం లేదు. ఎన్ని ఇళ్ళని ఆక్రమిస్తావ్. ఇంకోరోజు ఇలానే వర్షం పడుతుంది. అప్పుడు ఈ ఇల్లు కూడా విరిగి పోతుంది. అప్పుడు ఏం చేస్తావ్. "త్వరగా గూడు నిర్మించుకో ..లేదంటే ప్రమాదంలో పడతావు అన్నది చిలక. వేరే వాళ్ల మీద ఎప్పుడు ఆధారపడకూడదు నీ తెలివి తేటలతో నువ్వు బతకాలి". నేను ప్రమాదం అని చెప్పినా కూడా నువ్వు ఆహారం కోసం అత్యాశతో వచ్చావు. "అత్యాశ ఎవరినైనా ప్రమాదంలో పడేస్తోంది". అన్నది చిలక. చిలక మాటలు విన్న కాకి అర్థం చేసుకొని తన జీవితాన్ని ఆనందంగా కొనసాగించింది. అప్పటి నుంచి చిలకా, కాకి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ హాయిగా జీవించారు.
నీతి;- "ఎవరికైనా సరే అహంకారం ఉండకూడదు, బద్ధకం అస్సలు ఉండకూడదు. " "ఎవరి దారి వాళ్లు చూసుకుని జీవితం కొనసాగిస్తే బాగుంటుంది" "ఎప్పుడైనా సరే వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదు"
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి