అష్ట మూర్తులు:ఆ కా శ రూ పు డు - భీ ము డు (5)"శంకర ప్రియ.," శీ ల.,సంచార వాణి:. 99127 67098

 👌ఆకాశము రూపుడు 
      అ క్షరుడు, పుష్కరుడు
      నీల మౌళి, భీముడు
             ఓ తెలుగు బాల!
   
👌పరమేశ్వరుడు.. పంచ మహా భూతము లలో.. అయిదవ దైన "ఆ కా శ ము" స్వరూపం లో విరాజిల్లు చున్నాడు. "భీ మ" నామముతో వ్యవహరింప బడు చున్నాడు.
👌 సాంబ శివుడు.. సచ్చిదానంద మయ పరం బ్రహ్మము. శ్రీ కైవల్య ప్రదాత. వినాశనము కాని వాడు. కనుక "అక్షరుడు". అనంత మైన ఆకాశము నందు వ్యాపించిన వాడు. హృదయ పద్మము నందు ప్రకాశించు వాడు. కనుక "పుష్కరుడు". నీలత్వము తో కూడిన ఆకాశమే శిఖగా కల వాడు. కనుక, "నీల మౌళి". నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వ రూపుడు ..శివుడు.
👌 "భీ ము" డనగా.. దుర్మార్గులకు.. రౌద్ర రూపము తో భయమును, భ్రాంతిని.. కలిగించు వాడు. అదే విధము గా, సన్మార్గులకు.. సౌమ్య రూపముతో సుఖమును, శాంతిని అనుగ్రహించు వాడు. కనుక, "భీ ము డు"... అష్ట మూర్తు లలో అయిదవ వాడు.
           * * * * *
        ( శ్రీ ఉమా మహేశ్వరు డే... అష్ట మూర్తి యైన జగ దీశ్వరుడు. అందు వలన, ఆగమ వేత్తలైన అర్చక స్వాము లందరు; "నిత్యార్చనా విధి" లో శ్రీ మహా శివ లింగ మూర్తి యైన స్వామి వారిని.. "ఓం భీమాయ, ఆకాశ మూర్తయే నమః"! అని, పత్రములు, పుష్పము లతో పూజించు చున్నారు! )
కామెంట్‌లు