అష్ట దిక్పాలకులు: వా యు దే వు డు (6) "శంకర ప్రియ"., శీ ల.,సంచార వాణి: 99127 67098

 👌పవ మానుడు వాయువు
      జింక గుర్రము రౌతు
    
      వాయవ్య దిశకు పతి
             ఓ తెలుగు బాల!   
   
               * * * * 
👌"వాయువు" అనగా విసిరెడు వాడు! సర్వదా సంచరించెడు వాడు. కనుక, "సదా గతి"; "సమీరుడు"; "పవ మానుడు"! అని పేరులు. 
      
👌వాయు దేవుడు.. ఈ చరాచర ప్రపంచమునకు, సమస్త జీవరాశికి; ప్రాణమైన వాడు. కనుక, "జగత్ ప్రాణుడు"!
     
                  * * * * *
                 (వాయు దేవుడు... వాయవ్య దిక్పాలకుడు! అనగా, పశ్చిమ.. ఉత్తర దిక్కుల మధ్య నున్న వాయవ్య మూలకు అధిపతి. గంధ వహుడు, అనగా.. పుష్పాదుల గంధమును దాల్చువాడు. "తావి మోపరి"! వాయు దేవుడు.. ఆకాశమున పుట్టిన వాడు.. "నింగి చూలి"! మరియు "గాలి"!.. అనునవి; అచ్చ తెలుగు పదాలు. )
కామెంట్‌లు