తాతయ్య కథలు-61..:- ఎన్నవెళ్లి రాజమౌళి

  ఏంటి తాతయ్య! నాన్న డబ్బులు ఇచ్చినా లెక్క పెడుతున్నావా... అవున్రా ఇంటి లోనైనా, బయట నైనా డబ్బులు ఇచ్చినా, తీసుకున్నా లెక్క పెట్టాలి.
ఎందుకు తాతయ్య ఇచ్చేముందు వాళ్లు లెక్క పెట్టే ఇస్తారు కదా!
వాళ్లు ఇచ్చుడు వరకు బాగానే ఉంది. వాళ్లు తక్కువ ఇవ్వవచ్చు. లేదా... ఎక్కువ కూడా పొరపాటు లో ఇవ్వచ్చు కదా!
ఇప్పుడే కాదు రా. తాతయ్య చిన్నప్పటినుండి అంతే...
ఒకటికి రెండుసార్లు లెక్క పెట్టే వాడు. ఇప్పుడు నీకు చెప్పినట్టే నాకు కూడా చెప్పేవాడు. అని నాన్న అనగానే-
తాతయ్య గ్రేట్... అని మనవడు చప్పట్లు కొట్టే సరికి పకపక నవ్వులు చిందించాడు తాతయ్య.
కామెంట్‌లు