👌రా రాజు కుబేరుడు
రొక్కముల యెకిమీడు
ఉత్తర దిశకు ప్రభువు
ఓ తెలుగు బాల!
* * * *
👌"కుబేరుడు" అనగా, కుత్సిత మైన శరీరము ( బేరము) కలవాడు. కాయ గాచిన కన్నులు గల ఉత్తముడు. కనుక "కాయ కన్మేటి"!
👌కుబేరుడు- ధనమునకు అధిపతి- ధనాధిపుడు! కనుక "రొక్కముల ఎకిమీడు"!
👌యక్షుడు అనగా పూజింప బడువాడు.. రారాజు! రాజులకు రాజు. యక్షులకు ప్రభువు. కనుక "జక్కుల దొర"!
* * * * *
(కుబేరుడు.. ఉత్తర దిక్పాలకుడు! అనగా ఉత్తరదిశ నేలువాడు. కనుక "వడచక్కి ఎకిమీడు"! ధనదుడు అనగా ధనము నిచ్చువాడు. మరియు ధనమును రక్షించు వాడు. కనుక "చాగ కాడు".. అని, అచ్చ తెలుగు పదాలు! )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి