అష్ట మూర్తులు:చం ద్ర రూ పు డు - మ హా దే వు డు (7) "శంకర ప్రియ.," శీ ల.,సంచార వాణి:. 99127 67098

 👌చంద్ర రూపుడు శివుడు
      కళా నిథి, శుభ కరుడు
      మృడుడు, మహా దేవుడు
             ఓ తెలుగు బాల!
   
👌పరమేశ్వరుడు.. పంచ మహా భూతము లలో.. ఏడవ దైన "చంద్రుని" స్వరూపం లో విరాజిల్లు చున్నాడు. "మహా దేవ" నామము తో వ్యవహరింప బడు చున్నాడు.
👌 సాంబ శివుడు.. సకల దేవతా స్వరూపుడు. సకళ, నిష్కళ స్వరూపుడు. షోడశ కళా ప్రపూర్ణుడు. కళ లన్నింటికి ఉనికి పట్టు.కనుక, "కళా నిధి". సమస్తమైన శుభములు, మంగళములు.. కలిగించు వాడు. కనుక, "శుభ కరుడు". ఆరాధకులకు, సాధకులకు .. శాంతి సౌక్యముల నొసంగు వాడు.కనుక, "మృడుడు". సర్వ లోకైక నాథుడు.. శివుడు.
👌 "మహా దేవు" డనగా.. సకల ప్రాణి కోటికి, విశిష్ఠ మైన మహత్తరమైన వేలుపు.వేలుపు లందరికీ గొప్ప దైవము. కనుక, 
 కనుక, "మహా దేవుడు"... అష్ట మూర్తు లలో ఏడవ వాడు.
           * * * * *
        ( శ్రీ ఉమా మహేశ్వరు డే... అష్ట మూర్తి యైన జగ దీశ్వరుడు. అందు వలన, ఆగమ వేత్త లైన అర్చక స్వాము లందరు; "నిత్యార్చనా విధి" లో శ్రీ మహా శివ లింగ మూర్తి యైన స్వామి వారిని.. "ఓం మహా దేవాయ, చంద్ర మూర్తయే నమః"! అని, పత్రములు, పుష్పము లతో పూజించు చున్నారు! )
కామెంట్‌లు