"సరియైన ఆలోచన ఆచరణలో పెడితే డబ్బు సంపాదించవచ్చు" చెప్పాడు గోపాలం.
"నాకు అర్థమయ్యేట్టు చెప్పు"అన్నాడు రమణ.
"నాతో రా చూపిస్తాను"అని గోపాలాన్ని తీసుకుని ఊరికి తూర్పు వైపున ఉన్న కొండ వద్దకు తీసుకవెళ్ళాడు.అక్ఖడ వింతగా నల్లగా మిల మిల మెరిసే రాళ్ళు ఉన్నాయి.గోపాలం ఓ పెద్ద రాయిని తీసుకుని ఆ నల్ల రాళ్ళను విరగొట్టాడు.కొన్ని రాళ్ళు పెంకులుగా ఊడి పడ్డాయి.ఊడిపడ్డ పెంకుల్ని వేరే రాయిమీద అరగదీసి వాటికి చక్కని రూపు తెచ్చాడు.జాగ్రత్తగా ఆ రాళ్ళకు కన్నం వేశాడు.ఇదంతా చూస్తున్న రమణ ఆశ్చర్యపోయాడు.
"ఇప్పుడు ఏంచేస్తావు?" అడిగాడు రమణ.
"పద చూపిస్తాను" అని ఆరాళ్ళను రమణను తీసుకుని ఊరిలో జరిగే సంతకు వెళ్ళాడు.
సంతలో ఓ చెట్టుకింద గుడ్డ పరిచి,గుడ్డ మీద తాను తయారు చేసిన రాళ్ళ పెంకులను పరిచి అక్కడ కూర్చున్నాడు.
ఒక వ్యక్తి అటువైపువచ్చి"ఎందుకు ఈ రాళ్ళ?" అడిగాడు.
"అయ్యా,ఈ రాళ్ళు చాలా ప్రత్యేక మైనవి,తాళపు గుత్తిని దీనికి తగిలిస్తే,తాళం గుత్తిని సులభంగా గుర్తు పట్టవచ్చు.ఈ నల్లరాయిని పదే పదే తాకడం వలన శరీరానికి హాయి అనిపిస్తుంది,ఒక్కోరాయి కేవలం రెండు రూపాయిలు"చెప్పాడు గోపాలం.
వచ్చిన వ్యక్తి ఆ రాళ్ళను ఆసక్తితో పరిశీలించి,రెండు రాళ్ళను నాలుగు రూపాయిలిచ్చి కొన్నాడు.ఆ విధంగా గోపాలం ఇరవై రూపాయలు సంపాదించాడు.ఈ తతంగం అంతా చూసి రమణ ఆశ్చర్య పోయాడు.పది రూపాయలు పెట్టి గోపాలం ఆ సంతలోనే ఒక గిన్నె కొన్నాడు.
"ఈ గిన్నె ఎందుకు?" అడిగాడు రమణ.
"వచ్చే వారం సంతలో నేనేం చేస్తానో చూడు తెలుస్తుంది"
"మరుసటి వారం సంతలో గోపాలం రాళ్ళతో ఒక పొయ్యి తయారు చేసి చితుకులు పోగేసి గిన్నె వేడిచేసి అందులో కొబ్బరి నూనె,వేపనూనె కలిపి నీలగరి ఆకులు వేసి మరగించి వడగట్టి ఇరవై సీసాల్లో పోశాడు.
సంతకు వచ్చిన వాళ్ళు ఈ మందు దేనికి?" అని అడిగారు.
"అయ్యా,ఇది నీలగరి ప్రత్యేక తైలం ,కీళ్ళ నొప్పులకి,వళ్ళు నొప్పులకి అధ్బుతం,కేవలం ఐదు రూపాయలు ఒక్క సీసా" చెప్పాడు గోపాలం.
మూడు గంటల్లోనే ఇరవై సీసాలు అమ్ముడు పోయాయి.ఆ విధంగా గోపాలం వందరూపాయిలు సంపాదించాడు.అదీ న్యాయ బద్దంగా ఎక్కడా అబద్దాలు చెప్పలేదు,మోసం చేయలేదు!
గోపాలం తెలివికి రమణ ఆశ్చర్యపోయాడు.
కేవలం తెలివిని సక్రమమైన ఆలోచనల్ని పెట్టు బడిగా పెట్టి డబ్బు సంపాదించిన గోపాలాన్ని రమణ మెచ్చుకుని,తనుకూడా ఆ విధంగా ఆలోచించాలను కున్నాడు.
లాభసాటి ఆలోచన:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి