తాతయ్య ఓ చిన్న పిల్లల మూడు చక్రాల సైకిల్ కొనుక్కొచ్చాడు.అది చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్య పోయారు.
"మనింట్లో చిన్నపిల్లలు ఎవరూ లేరుకదా,తాతయ్య ఈ సైకిల్ ఎవరికోసం తెచ్చావ్?" అడిగాడు తాతయ్య మనవడు ఇంటర్ చదివే సుధీర్.
తాతయ్య చిరునవ్వుతో చెప్పాడు, "సుధీర్ చిన్నప్పుడు నీకు సైకిల్ కొన్నాను.దానితో నీవు బాగా ఆడుకున్నావు,అది పాడైపోయింది.పాత ఇనప సామాను కొనేవాడికి అమ్మేశాము...నిన్న మన పనిమనిషిరంగమ్మ మనవడు సైకిల్ కొని పెట్టమని ఏడ్చాడు.దాని కొచ్చే జీతంలో అది సైకిల్ ఏం కొనగలదు?మీకు తెలియని విషయం ఒకటి చెబుతాను,చిన్నప్పుడు నాకు మూడుచక్రాల సైకిల్ కొని పెట్టమని అడిగితే అప్పట్లో తనకొచ్చే మూడొందల జీతంలో నాకు సైకిల్ కొని పెట్టలేక పోయాడు మా నాన్న.పిల్లలకు సైకిల్ ముచ్చట ఎంతో ఉంటుంది.అది వాళ్ళకు దక్కక పోతే వాళ్ళు పడే బాధ నాకు తెలుసు.ఎందుకంటే నేను చిన్నప్పుడు ఆ బాధ అనుభవించాను.సుధీర్ ఈ రోజు నా పుట్టిన రోజు కదా,ఈ శుభ సందర్భాన రంగమ్మకొడుక్కి ఈ సైకిల్ బహుమతిగా ఇచ్చి వాడి కళ్ళలో ఆనందం చూస్తాను"చెప్పాడు తాతయ్య.
ఆయన మంచి ఆలోచనకు,మంచి మనస్సుకు సుధీర్,అతడి నాన్న,అమ్మ చప్పట్లు కొట్టారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి