మౌనము:---బి నారాయణకాకతీయ నగర్హైదరాబాద్ 9440065312
మౌన ముత్త మమ్ము మహిలోన మనిషికి 
మౌన మెరుగ నట్టి మనిషి లేడు 
మౌనమాచరించ మనిషికే కాగ్రత 
పరిఢవిల్లి  మనిషి ప్రజ్ఞు డగును

మౌన మేమికొత్త-మనిషికిభువిలోన 
నిత్యకృత్య మదియు నిజము చెప్ప 
పట్టుదలతొ మనిషి పనిలోన మునిగిన 
మాట పలుక బోడు మరిచి గూడు

మౌన మాచరించ మనిషి అడవి కెళ్ళు 
మనసు నదుపు నుంచు మార్గ మెదుకు 
ధ్యాన మాచరించు తత్వము కనుగొను 
శ్రద్ధ  పెంచు మంచి శక్తి కొరకు


అడవి కెళ్ళకుండ అదుపుచేయ మనసు 
మౌనవ్రతము గొప్ప మార్గ మగును
శక్తి యుక్తి పెరుగు చైతన్య మబ్బును  
మాట నదుపు చేసి మాన్యు డగును

దీక్ష వున్న యెడల దక్షత పెంపొందు
లగ్న మగును మనసు లక్ష్యమునకు
మరువ బోడు మనిషి మౌనంగ పనిచేయ
మనిషి తత్వ మదియు మహిని నమ్ము