పూర్వ కాలంలో శివవర్మ అనే రాజు ఉండేవాడు.ఆయనకు దమయంతి అనే భార్య ఉండేది.శివవర్మ మంచి పరిపాలనా దక్షుడు.రాణి తన పుట్టినరోజు సందర్భంగా తనని అడవికి
తీసుకెళ్ళమని రాజుని అడుగుతుంది.
రాణి కోరిక మేరకు ఒక రోజు రాజు తన భార్యతో కల్సి సరదాగా అడవికి వేటకు వెళ్ళాడు. ఆ రాజు వెనుక సైనికులు కూడా ఉన్నారు.రాజు వేగంగా రథం నడుపుతుంటాడు.రాజు జంతువులని వేటాడటంలో నేర్పరి.అతనికి విలువిద్యలో కూడా
మంచి నైపుణ్యం ఉంది.
రథం వేగంగా వెళుతున్న సమయంలో అడివిలో జంతువుల అరుపులు పెద్దగా విన్పించాయి
ఆ అరుపులు విని రాణి కంగారు పడుతుంది.
రథం ఆపి చూస్తే ఏనుగు,సింహం భీకరంగా పోరాడటాన్ని రాజు గమనించాడు. కానీ సింహం దూకుడుకి ఏనుగు విలవిలలాడుతూ పెద్దగా అరుస్తుంది.ఏనుగుపై జాలి పడిన రాజు భార్య ,ఆ ఏనుగుని రక్షించమని రాజుని అడుగుతుంది.రాణి మాటని మన్నించిన రాజు సింహంతో తలపడ్డాడు. సింహం ఏనుగుని వదిలి రాజు వైపు దూసుకొస్తుంది.దీనితో రాజు భార్య భయంతో స్పృహ తప్పి పడిపోతుంది.
ఇంతలోనే వెనుకున్న కొందరు సైనికులు సింహాన్ని వెంబడించి బంధిస్తారు.సైనికుల దాడికి గురై గాయాలపాలయ్యిన సింహం రాజుతో ఇలా అంటుంది."మహారాజా! మీరు ప్రజలకి రాజైతే,నేను ఈ ఆడవికి రాజుని.మీరు సరదాగా మమ్మల్ని వేటాడి,మీరు ఆనందం పొందుతారు.మీరు మీ భార్య కోరిందని ఏనుగుని విడిచి పెట్టారు.నాకు ఆకలి అయితేనే నేను వేటాడతాను. సరదాకోసం నేను వేటాడను. మరి ఇప్పుడు నా ఆకలి ఎవరు తీర్చుతారు?' మీరు ఒక జంతువుపై జాలి చూపారు. మరొక జంతువుని చంప బోతున్నారు.ఇదెక్కడి న్యాయం? సమన్యాయం
ఎక్కడుంది అని ఆవేదనగా
అడుగుతుంది.
సింహం మాటలతో రాజు ఆలోచనలో పడ్డాడు. ఓ మృగరాజా! నీవు చెప్పింది నిజమే. ఇక నుంచి సరదాకోసం
నేను జంతువులని వేటాడను.నా రాజ్యములో అందరికి ఒకటే న్యాయం ఉంటుంది,నీకు ఎటువంటి హానిని మా సైనికులు తలపెట్టరు అంటూ సింహాన్ని వదిలిపెట్టమని రాజు సైనికులకు ఆదేశాలిస్తాడు.ఇకనుంచి ఎవరూకూడా రాజ్యంలో సరదాకోసం జంతువులని వేటాడొద్దని రాజు చెప్తాడు.గాయపడ్డ సింహనికి రాజు వైద్యం చేయమని రాజ వైద్యుడిని కోరాడు. ఇంతలోనే స్పృహలోకి వచ్చిన రాజు భార్య, ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తుంది.రాజు నిర్ణయం పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు.
సమ న్యాయం:-ఎమ్.హేమంత్-తిరువూరుఫోన్:9492712836
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి