జికాతో జాగ్రత!:- యం. రామ్ ప్రదీప్--తిరువూరు,9492712836: - చిత్రం : భూపతి తునికి, కరీంనగర్

 ప్రస్తుతం కరోనాతో పాటు జికా
వైరస్ కూడా కేరళలో కలకలం
రేపుతోంది.డెంగ్యూ మాదిరిగానే
జికా వైరస్ దోమ కాటు వల్ల వస్తుంది.ఇది ప్రధానంగా పగటిపూట కుట్టే ఏడిస్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుంది.
ఈ వైరస్ కొత్తది కాదు.1947లో
ఈ వైరస్ ని తొలిసారిగా ఆఫ్రికాలో గుర్తించారు.2015లో ఈ వైరస్ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా ప్రబలింది.2016లో
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్
వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది.
ఈ వైరస్ బారినపడిన వారికి మొదట డెంగ్యూ లాగా జ్వరం
వస్తుంది.జలుబు,దగ్గు,తలనొప్పి, శరీరంపై దుద్ధర్లు వచ్చే అవకాశం ఉంటుంది.కొంతమందిలో కీళ్లనొప్పులు, కండ్ల కలక వంటి
లక్షణాలు కనిపిస్తాయి. వెన్నుముక, నాడీ సంబంధిత 
సమస్యలు వస్తాయి.
ఈ వైరస్ వ్యాధికి వ్యాక్సిన్ లేదు.వ్యాధిసోకిన తరువాత నిర్దిష్త చికిత్స ప్రక్రియ లేదు.ఇతర వైరల్ జబ్బుల విషయంలో ఇచ్చే మందులే దీనికి ఇస్తారు.ఇప్ప‌టివ‌ర‌కు జికా వైర‌స్‌కి ప్ర‌త్యేకంగా మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ లేవు. బాగా విశ్రాంతి తీసుకోవాలి. శ‌రీరం డీ హైడ్రేష‌న్‌కి గురికాకుండా ద్ర‌వ‌ప‌దార్థాలు ఎక్కువ‌గా తీసుకోవాలి.జ్వ‌రం, నొప్పుల‌ను త‌గ్గించే మందులు వాడాలి.యాస్ప్రిన్ గానీ, ఇంకా ఇత‌ర నాన్ స్టిరాయిడ‌ల్ యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ డ్ర‌గ్స్ అంటే ఇబుప్రొఫెన్‌, న్యాప్రాక్సెన్ లాంటివి వాడకూడ‌దు. డెంగ్యూ, జికా ల‌క్ష‌ణాలు లేవ‌ని తేలేవ‌ర‌కు ఈ మందుల‌ను వాడ‌కూడ‌దు. అలా వాడితే ర‌క్త‌స్రావం ప్ర‌మాదం ఉంటుంది.మ‌రేదైనా అనారోగ్యానికి మందులు వాడుతున్న‌వారు కూడా డాక్ట‌రుని సంప్ర‌దించాకే మందులు వేసుకోవాలి.జికా ల‌క్ష‌ణాలున్న‌వారికి ఒక వారం వ‌ర‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ దోమ‌లు కుట్ట‌కుండా జాగ్ర‌త్తప‌డాలి. ఎందుకంటే ఇన్‌ఫెక్ష‌న్ సోకిన‌ మొద‌టివారంలో ర‌క్తంలో జికా వైర‌స్ ఉంటుంది. దోమ‌లు మ‌ళ్లీ కుట్టిన‌పుడు ఆ వైర‌స్ వాటి ద్వారా తిరిగి మ‌రొక వ్య‌క్తికి సంక్ర‌మించ‌వ‌చ్చు. 
గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ వైరస్ తో మరణించే వారి సంఖ్య తక్కువగానే ఉంటుంది.
వ్యాధి సోకిన వారిలో ఒక్క శాతం మంది చనిపోయే అవకాశం ఉంటుంది.
దోమలని నియంత్రణకు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.ఇంట్లో నీరు నిల్వ ఉంచుకోకూడదు.వ్యాధి సోకిన వారు బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తగ్గిన
తర్వాత కొంత కాలం లైంగిక కార్యక్రమాలకి దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం దీని నివారణకు వ్యాక్సిన్ ని తయారు చేస్తున్నారు. త్వరలో
అందుబాటులోకి వస్తుంది.