మిలమిల తారకమ్మ:---గద్వాల సోమన్న

నింగిలో తారకమ్మ
మిలమిల మెరిసింది
వెలిగేటి వదనముతో
కిలకిల నవ్వింది

జాబిలితో జతకట్టి
సందడి చేసింది
పౌర్ణమి రోజుల్లో
దోబూచలాడింది

అందరికి రాత్రి పూట
దర్శనమిస్తుంది
అందాలు ఒలకబోసి
కనువిందు చేస్తుంది

మనోహర తారకలు
గగనమ్మ పిల్లలు
పసి పిల్లల మాదిరి
ఎల్లరికి మిత్రులు