జీవితం పరుగు :-ఎం.వి. ఉమాదేవి . నెల్లూరు

పుట్టక ముందే అందర్నీ పరుగులు పెట్టిస్తావ్ 
పుట్టే రోజున బాగా ఏడిపిస్తూనే పుడతావ్ 
మరి నువ్వేడవక పోతేనో..? మళ్ళీ పరుగులు నీ వాళ్ళు !

ఇంట్లో మరి వేగంగా సాగే పనులు,స్నానం, పాలు,చొక్కా !
 ఉయ్యాలకోసం ఉరుకులు పరుగులు,ఊరుకోబెట్టే లాలిపాట 
నువ్వు వేసే తప్పటడుగులు ఇంట్లో సంతోషం పరుగులు!

ఎదిగిన కోరికలచిట్టా కోసమే 
కన్నవాళ్ళ ఆరాటం 
తీరే నాటికి సొంత సంపాదన తెచ్చిన అహం రన్నింగ్ రేస్ !
అందాన్ని చూస్తే పెరిగే గుండెపరుగు !
జీవితం లో స్థిరత్వం కోసం తోటి వాళ్ళతో మారథాన్ !

చివరికి ఏదోరోజు చెప్పులైనావేసుకోకుండా.. 
చెప్పా పెట్టకుండా.. చిరశాంతి మందిరం వైపు నీ పరుగు.. 
శాశ్వతంగా ఆపు తూ... !!


కామెంట్‌లు