ఊరి ఇ పొలిమేర్లలో కూడా ఎండమావులు ఉంటాయి
కారడవులే కాదు
నగరాలు కూడా జంతుప్రదర్శనశాలలే !?
భూమికి దిగిన మేఘం భూమి లోపలి కూడా దిగి అమోఘ యోగము న్న ఒక యోగిలా మారింది !?
పక్షి పాటను మోసుకెళ్లిన గాలి రెక్కలు లేకుండానే ఎగిరినట్లు ఆకాశవాణి సాక్ష్యం చెబుతుంది!?
మాటను ప్రసవించిన పాట కొత్త ఆట ఆడుతుంది
రాగం కన్నా ఓంకారం ప్రదర్శిస్తుంది!?
ఎదగడమే నేర్చుకున్న చెట్లకు చెమట కార్చడమే కొత్త చట్టమని చెప్పడం చేతకానితనం అవుతుంది!?
నింగినే వంచిన కంటికి విల్లంబులు ధరించి చేదించడం సిగ్గుచేటు ఏం కాదు!?
కడుపు నింపిన ఫలం ప్రతిఫలం ఆశించనట్లు
ఎవరైనా నా నీరులా చెట్ల పాదాలను కడిగి భూ తలంపై తల్లి పాలు తాగుతారా!?
వర్షం ఒకటే ఉరుములు మెరుపుల ఘర్షణను చల్లబరిస్తే
ఆది అంతం కాదు ముందు వెనక ప్రశాంతతకు సమాధానం తుఫాన్,
ఊపిరి ఆపడమే ఒక ప్రాణం ప్రాణం పోసుకోవడం!?
ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక కవి కలానికి అనునిత్యం సత్యం పలికే నీరు పల్లానికి పారినట్లు,
ఇప్పుడు పేదవాని కడుపు కాదు మెదడు చూపునుచూపుతున్నాడు!?
కలలు చెదిరిపోవు కాంతిని చల్లితే ఎలా వెలుగు పూలు పూస్తాయో
నలుగురికి నాలుగు దారులై భవిష్యత్తు నగరానికి ముఖద్వారమై నిలుస్తాయి!?
ఆడ మగ లు లాభనష్టాలు కాదు
అధికారం ధనం రాబోయే నాలుగు సింహాల ముఖంపై మెరిసే కొత్త అందాల చందమామల సృష్టికర్తలు !?
Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి