దాశరథి కృష్ణమాచార్యులు:-జె.నిర్మల సిద్దిపేట

 సీ.మా
వెంకటాచార్యుల వెంకటమ్మల పట్టి
దాశరథీ శ్రేష్ట ధైర్యుడితడు
సాహితీ క్షేత్రాన సార్వభౌముడిగాను
నవరసాలొలికించె నవనియందు
 చక్కటి రచనతో సాహిత్య శిఖరమై
బహుళ కావ్యాలతో పరిఢవిల్లె
స్వాతంత్ర యోధుడై సవ్యసాచిగనిల్చి
పీడిత ప్రజలకు ప్రేర్మి పంచి 
నాతెలగాణనే నాకోటి రతనాల
వీణని ధైర్యంబు విశధపరచి
నైజాము రాజుల నడ్డివిరచినట్టి
వీరయోధుడిగాను వెల్గినాడు
తే.గీ
చిన్నగూడురు గ్రామాన  జన్మమొంది
అతని కవనము రేపెను అగ్నిజ్వాల
తెలుగు నేలకు నెంతయో దిగులు దీర్చె
మనతెలంగాణ చైతన్య మాన్య మూర్తి
కామెంట్‌లు