అమ్మ ఒడి.:- తాటి కోల పద్మావతి గుంటూరు.


 ఆరోజు ఆదివారం కావడంతో ప్రకాష్ కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ కూర్చున్నాడు. భార్య శ్రీ వాణి కూడా వచ్చి పక్కనే కూర్చుంది. ఎదురుగా కనిపించే లాన్ లో గరిక మీద పిచ్చుకలు వాలి గింజల కోసం కిచకిచ మంటూ అటు ఇటు ఎగురుతున్నాయి ‌ కొన్ని పిచ్చుకలు దొరికిన గింజల్ని ముక్కుతో పట్టుకొని పోయి ఎదురుగా ఉన్న జామ చెట్టు కొమ్మలపై కట్టుకున్న గూటిలో చిన్న పిల్లలకు గింజలు నోటికి అందిస్తున్నాయి. ఆ దృశ్యం చూస్తుంటే ఎంత మనోహరంగా ఉందో. ఇప్పుడే ఇప్పుడే వచ్చీరాని రెక్కలతో కిచకిచ మంటూ తల్లి పెట్టే ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి. శ్రీ వాణి ఆ పక్షుల గూటి వైపే చూస్తున్నది. భర్త ప్రకాష్ ఆమెని పరికించి చూస్తున్నాడు. చూశారా ఆ పక్షులు కూడా తమ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నా యో. ఆ భగవంతుడు అందరికీ పిల్లల్ని ఇచ్చాడు. చివరకి జంతువులకే ఖర్చులకి కూడా పిల్లలు ఉన్నారు. మనకి మాత్రం అదృష్టం లేదంది.

భార్య బాధని అర్థం చేసుకున్నాడు. పిల్లలు లేరనే గా నీ బాధ అ ఇప్పుడు ఏమైందని ఎవరినైనా నా మన బంధువుల పిల్లల్ని తెచ్చుకొని పెంచుకుందాం అన్నాడు. ఇంతలో సూర్యం బాబాయి వచ్చి కూర్చున్నాడు. ఇద్దరిని గమనించి ఎందుకలా ఉన్నారంటూ అడిగాడు. ప్రకాష్ పిల్లలు లేదనే బాధ మమ్మల్ని కృంగదీస్తుంది అందుకే మా బాధ అన్నాడు. శ్రీ వాణి లోపలికి వెళ్లి కాఫీ కప్పుతో వచ్చి ఏమిటి బాబాయ్ గారు విశేషాలు అంటూ కాఫీ అందించింది. ఏం చెప్పమంటావు అమ్మ మీరు పిల్లలు లేరని బాధపడుతున్నారు. మేము ఉండి కూడా బాధపడుతున్నా మన్నాడు. అదేమిటి బాబాయ్ అలా అంటారు మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కదా అదృష్టవంతులు మీరు అన్నది. ఏం అదృష్టమో ఏమో. ఉద్యోగాలు అంటూ దూరంగా వెళ్లిపోయారు లేవలేని పరిస్థితిలో ఇక్కడ మేము ఉన్నాము మమ్మల్ని చూసే నాధుడు లేడు. ఈ వయసులో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము పిల్లల దగ్గర ఉంటే బాగుంటుందన్నారు. ఉన్నదంతా ఖర్చుపెట్టి ఇ చదివించాను. రెక్కలొచ్చిన పక్షులు లాగా ఎగిరిపోయారు. గూటిలో ఒంటరిగా మిగిలిపోయా మంటూ బాధ పడ్డారు సూర్యం బాబాయ్. ఆ మాట ఈ మాట మాట్లాడుకున్నారు. మీ పిన్ని నా కోసం ఎదురుచూస్తుంటుంది. కూరగాయల కోసమని వచ్చాను దారిలో మిమ్మల్ని చూసి పలకరించి పోదామని వచ్చాను అంటూ సంచి చేతబట్టుకొని బయలుదేరాడు. నెల రోజుల తర్వాత శ్రీ వాణి ప్రకాష్ బంధువుల ఇంటికి పెళ్లి కి వెళ్లారు. అక్కడ అ శ్రీవాణి తరఫున బంధువులు మీకు ఎలాగూ పిల్లలు లేరు కదా మా వాళ్ళని పెంచుకుంటూ అడిగారు. అంత ఆస్తి ఉంది ఏం చేసుకుంటారు ఎవరినైనా మన వాళ్ళలో దత్తత తీసుకుంటే మంచిదంటూ శ్రీ వాణి చెల్లెలు సలహా ఇచ్చింది. ఇటు ప్రకాష్ తరపు బంధువులు వాళ్ళ పిల్లల్ని దత్తత ఇస్తామన్నారు. అందరికీ వాళ్ల ఆస్తి మీద కన్ను పడింది. పెద్ద బంగళా కారు శ్రీ వాణి కి కావలసినంత బంగారం అన్నీ ఉన్నాయి. పిల్లలు లేరనే దిగులు బాగా ఉంది. ఆ పెళ్లిలో ఇద్దరి చుట్టూ దత్తత తీసుకో మంటూ వెంటపడ్డారు. భార్య తరఫున తీసుకుంటే భర్తకి కోపం. భర్త తరఫున తీసుకుంటే భార్యకి నచ్చదు. ఆలోచించి చెప్తామన్నారు. ఇంటికి వచ్చాక ప్రకాష్ తన మనసులో మాట బయట పెట్టాడు. మనం ఎలాగో పిల్లల్ని దత్తత తీసుకోవాలి అనుకున్నాం. మన బంధువుల్లో అయితే మనమధ్య విభేదాలు రావచ్చు. ఒక పని చేద్దాం అనాధ శరణాలయం నుంచి తెచ్చుకుంటే ఎవరికీ బాధ ఉండదు. నాకు తెలిసిన నా మిత్రుడు చెప్పాడు. నీకు ఇష్టమైతే రేపు వెళ్లి చూద్దాం అన్నాడు. మీ ఇష్టమే నా ఇష్టం అన్నది. మంచి రోజు చూసుకుని ఇద్దరూ అనాధ శరణాలయం కి వెళ్లారు. చిన్న చిన్న పిల్లలు బోసినవ్వులతో ముద్దొస్తున్నా రు అంత చిన్న పిల్లల్ని పెంచడం కష్టం అనిపించింది. ఐదారేళ్ల పిల్లలు చలాకీగా ఉన్నారు. వాళ్లని దగ్గరికి పిలిచి మాతో వస్తావా అన్నారు. అడ్డంగా తల ఊపారు. మీకు బోలెడన్ని చాక్లెట్లు కొనిపెడతాను మంచి కాన్వెంట్లో చదివిస్తాం రకరకాల బొమ్మలు మంచి మంచి డ్రస్సులు ఇస్తామన్నారు. పిల్లలిద్దరూ ఆశగా చూశారు. శ్రీ వాణి పాప కావాలంది. ప్రకాష్ బాబు కావాలన్నాడు. అయితే ఒక పని చేద్దాం ఇద్దరినీ తీసుకెళ్దాం అన్నా చెల్లెలు గా కలసిమెలసి ఉంటారు. ఒకరికి ఒకరు తోడుగా. రేపు మనం పెద్దయ్యాక వాళ్లే మనకు తోడు నీడ అన్నది. శరణాలయం వారితో మాట్లాడి నిబంధనల ప్రకారం ఒప్పందం కుదుర్చుకుని పిల్లలిద్దరినీ ఇంటికి తీసుకు వచ్చారు. ఆ రోజు నుంచి ఆ ఇల్లు పిల్లల నవ్వులతో కళకళలాడుతుంది. మంచి కాన్వెంట్లో చేర్పించారు. ఇద్దరిని అల్లారుముద్దుగా చూసుకుంటుంటే అమ్మ ఒడిలో హాయిగా ఆనందంగా గడుపుతున్నారు. ఆనాటి చిన్నారులు పాతికేళ్ల తర్వాత చదువుతోపాటు సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తూ అమ్మానాన్న లను కనిపెట్టుకొని ఉంటున్నారు. అనాథలుగా పెరగాల్సిన మమ్మల్ని ఇంత వాళ్లను చేసి మంచి జీవితాన్ని అందించినందుకు కృతజ్ఞతగా తల్లిదండ్రుల నీడలో ఉంటూ ఆ ఇద్దరూ అమ్మానాన్నల్ని వదిలి ఉండలేదు ఏనాడు. వృద్ధాప్యంలో కూడా భూత కర్ర లై నిలబడ్డారు. అమ్మ వడి ఒక గుడి లాంటిది.


కామెంట్‌లు