లక్ష్యాలపై గురి (బాల గేయము) పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

వాయిదాలను మానాలి
తిరుగుళ్ళునే ఆపాలి
నిత్య శ్రమలనే పెంచాలి 
విజేతలుగా ఎదగాలి 

లక్ష్యాన్ని ఒకటి చూడాలి
మంచి కలలే కనాలి 
అడుగులు ఎన్నో వేయాలి
గమ్యాన్ని అందు కోవాలి

పెద్దల మాటలు వినాలి 
మంచి పుస్తకం చదవాలి 
గట్టి పట్టుదల ఉండాలి
జ్ఞానం ఎంతో పెంచాలి