అక్క-గున్నాల సరళ--జి ప ఉ పా మల్కాపూర్--సంగారెడ్డి

కం*అమ్మను తమ్ములగాచగ
ఇమ్ముగప్రేమామృతమ్ము నిచ్చెడితమ్మిన్
చెమ్మనుకంటికిదాకని
సొమ్మొక్కటినివ్వుదేవ శూశృతజేయన్

కం*చిరుకోపముమోమునగన
మెరుపొక్కటిగుండెలోన మెరియుచునుండున్
సరిరారురనీకెవ్వరు
మరువమునీప్రేమనెపుడు మానసమందున్

కం*తరగనిధనములనిమ్మని
కరివరదునిగోరిజెప్పి కనికరమొప్పన్
మరినీకొసగగ లచ్చిని
తరిజూడగమ్రొక్కుచుంటి తమ్ముడు నీకై