కదలని అమ్మ (బాల గేయం)-పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట
పెట్టు పెట్టు పెట్టు 
మొక్క తెచ్చి పెట్టు 
పెరుగుతుంటే చూడు
ఆనందాలే ప్రవహించు

మొగ్గలు వేసే మొక్కరా 
అందాలని పెంచురా
పువ్వు అయిన మొక్కరా
సీతాకోకచిలుక అయ్యెరా

దృష్టిని ఆకర్షించురా
దగ్గరకు రమ్మని పిలుచురా
స్వేచ్ఛ గాలుల నిచ్చురా
కదులని అమ్మ మొక్కరా

కామెంట్‌లు