పి.వి.ఆర్థిక సంస్కరణలు:-చంద్రకళ. దీకొండ,మల్కాజిగిరి,మేడ్చల్ జిల్లా.

ప్రక్రియ:సున్నితంరూపకర్త:శ్రీమతి నెల్లుట్ల సునీత గారు
***************************
1)నిరంతర నిశ్శబ్ద మౌనముని
బాహుభాషా పండిత మేధోజ్ఞాని
వామనరూపంలో దాగున్న చాణక్యుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!

2)దివాళా అంచునున్న ఆర్థికవ్యవస్థను
ప్రగతి పట్టాలెక్కించిన ఘనుడు
నేటిభారత ఠీవీ పి.వి.
చూడచక్కని తెలుగు సున్నితంబు...!

3)స్వంతఆస్తిని దానమిచ్చిన వితరణశీలి
భూసంస్కరణలకు బాటవేసిన పథగామి
నవోదయ పాఠశాలల సంస్థాపకుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!

4)ఎన్నో చేయాలన్న కోరికలతో
మాటలు కాదు చేతలలో
చేవ చూపించిన కార్యసాధకుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు...!

5)బాధితులను ఆదుకున్న ఆపద్బాంధవుడు
సరళీకృత ఆర్థికవిధానాల క్రాంతదర్శి
వలపక్షం వహించని సమవర్తి
చూడచక్కని తెలుగు సున్నితంబు...!!!